ట్రంప్‌ను తొలగిస్తే రూ.65 కోట్లు..!

SMTV Desk 2017-10-17 18:17:49  Washington, Amerika president, Donald trump, Larry Plint, founder of Hustler Magazine

వాషింగ్టన్, అక్టోబర్ 17 : అమెరికా అధ్యక్షుడి పదవి నుండి డోనాల్డ్ ట్రంప్ ను తొలగించే సమాచారం అందిస్తే వారికి రూ. 10 మిలియన్‌ డాలర్లు(65 కోట్లు) బహుకరించనున్నట్లు హస్ట్‌లర్‌ మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు లారీ ప్లింట్‌ సంచలన ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ పత్రికలో "నేను ట్రంప్ దగ్గర నుండి కోట్ల రూపాయలను ఆశించడం లేదు. కేవలం అతన్ని అధ్యక్ష పదవి నుండి తొలగి౦చాలి అనుకుంటున్నా" అంటూ పేర్కొన్నారు. అంత అత్యున్నత పదవికి ట్రంప్ అర్హుడు కాదని ఇదివరకే ఆయన నిరూపించుకున్నాడ౦టూ ప్రకటనలో వివరించారు.