ఇదేనా కుంబ్లే కి మీరిచ్చే గౌరవం ....

SMTV Desk 2017-10-17 18:07:30  BCCI, Netijanlu, Anil Kumble, Twitter, cricket

హైదరాబాద్ , అక్టోబర్ 17 : ఐసీసీ లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత్ క్రికెట్ ను తన కను సైగతో శాసిస్తున్న సంస్థ బీసీసీఐ(బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) పై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు భారత్ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 47వ పుట్టిన రోజు సందర్బంగా బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. టీం ఇండియా తరపున కెప్టెన్, కోచ్, బౌలర్ గా జట్టుకు ఎన్నో విజయాలు తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం . అటువంటి లెజెండ్ కి ‘టీమిండియా బౌలర్‌ అనిల్‌ కుంబ్లేకు శుభాకాంక్షలు’ అంటూ అతి సాధారణంగా ట్వీట్‌ చేసింది. దీని పై స్పందించిన సోషల్ మీడియా అభిమానులు దేశానికి పేరు, ప్రతిష్ఠలు సాధించిన కుంబ్లేకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఆయనో సాధారణ బౌలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటుని తరువాత గమనించిన బీసీసీఐ టీం ఇండియా కెప్టెన్ ,లెజెండ్ అంటూ మరో కొత్త ట్వీట్ చేసింది.