ఆయన ఆత్మ రోజు నా కలలోకి వస్తుంది : వర్మ

SMTV Desk 2017-10-17 17:42:54  Ram Gopal Varma, lakshmis ntr first look poster, Nandamuri Taraka Rama Rao, Lakshmis NTR, YSR P. Rakesh reddy

హైదరాబాద్, అక్టోబర్ 17: ‘ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా చిత్రీకరించడానికి నాకు అపారమయిన బలమిస్తు౦ది కేవలం ఒకే ఒక శక్తి అది ఎవరంటే NTR. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది’ అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఎన్. టి. రామారావు, లక్ష్మీ పార్వతి దంపతుల ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రానికి వై సిపి నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వహిస్తున్నారు.