లొంగిపోయిన నక్సల్స్ దంపతులు

SMTV Desk 2017-06-07 16:50:41  the surrendered naxals couple malkangiri, police , superintendent

హైదరాబాద్, జూన్ 7 : హత్యతో సహా పలు నేరాల్లో శిక్షలు ఎదుర్కుంటున్న నక్సల్స్ దంపతులు మల్కన్ గిరి పోలీస్ సూపరింటెండ్ ముందు బుధవారంనాడు లొంగిపోయారు. వీరి తలపై రూ. 9 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఈ దంపతులపై హత్యలు, హత్యాయత్నం, ఎదురెదురు కాల్పులకు సంబంధించి పలు కేసులు ఈ జంటపై నమోదైనట్లు తెలుస్తున్నాయి. కెలిమెలలో ఆంధ్రా ఓడిశా సరిహద్దు జోనల్ కమిటీ కింద ఈ ఇద్దరు గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంతలో బుధవారం తెల్లవారుజామున ఒడిసా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిత్రకొండ అడవుల్లో పోలీసులకు నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ ఘటనలో కరడుకట్టిన మావోయిస్టు హతమైనట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన సంఘటన స్థలంలో పెద్ద మొత్తంలో మావోయిస్టు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.