తూ. గో. జిల్లాలో యథేచ్చగా ఆయిల్ దందా

SMTV Desk 2017-10-15 17:56:20   East Godavari District, Oil mafia updates.

తూ.గో. జిల్లా, అక్టోబర్ 15 : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఆయిల్ మాఫియా యథేచ్చగా సాగుతో౦ది. దీని వెనుక తెదేపా కార్యకర్తల హస్తం ఉండటంతో అక్కడ దందా నిర్వహించు వారు నెల వారి మామూళ్ల రూపంలో ప్రత్తిపాడులో ఉన్న అధికారులకు చెల్లిస్తున్నట్లు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మామూళ్లు దండుకొని, ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాత్రింబవళ్ళు ఈ ఆయిల్ మాఫియా జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. దీ౦తో ప్రత్తిపాడు పోలీసులకు మీడియా వారు ఫోను ద్వారా సమాచారం అందించినా వారు కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తో౦ది. ఈ సమయంలోనే అక్కడకు మీడియా వెళ్ళగా ఒక మారుతి కారుపై పోలీస్ బోర్డు కలిగి ఉన్న కారు, ఆయిల్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం ఏ విధంగా చూసినా అనేక అనుమానాలు దారి తీస్తుంది. ఈ విషయంపై స్థానికులను ఆరా తీయగా ఎవరి నెలవారీ మామూళ్లు వారికి అందుతున్నాయని ఆరోపిస్తున్నారు.