రానున్న మరో ఐదు రోజులు వర్షాలు..

SMTV Desk 2017-10-15 15:11:29  Hyderabad, weather report updates.

హైదరాబాద్, అక్టోబర్ 15 : రానున్న మరో ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రానున్న మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడన ద్రోణి క్యుములోనింబస్ ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరచుకొని ఉండడం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.