హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2017-10-15 12:57:35   American President, Donald Trump, Hillary Clinton, Harvey Weinstein.

వాషింగ్టన్‌, అక్టోబర్ 15 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హిల్లరీ క్లింటన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ నటీమణులు ఏంజిలినా జోలీ, ఐశ్వర్య రాయ్ ఇలా ఎందరో నటీమణులను నిర్మాత హార్వే వీన్‌స్టైన్‌ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై హిల్లరీ స్పందిస్తూ ట్రంప్ ను హార్వేతో పోలుస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో హిల్లరీ మాట్లాడుతూ... " హార్వే మీద అత్యాచార ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నా.. మహిళలను తీవ్రంగా వేధి౦చి, అత్యాచారానికి పాల్పడ్డానని ఒప్పుకున్న వ్యక్తినే దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ లైంగిక వేధింపుల సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది" అని పేర్కొన్నారు.