డోక్లా౦లో భారత్ పాటించిన విధానాన్నే భర్తల వద్ద పాటించండి : సుష్మాజీ

SMTV Desk 2017-10-15 11:25:07  Indian Foreign Minister, Sushma Swaraj, Congress vice president, Rahul Gandhi.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున గుజరాత్ లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు డోక్లాం విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల వద్ద అనుసరించమని పిలుపునిచ్చారు. ఉద్యోగం చేయడానికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఏం చేయాలని ఓ మహిళ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ... ఉద్యోగం చేయడానికి ఒప్పుకోకపోతే మొదట దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి అయినా వినకపోతే డోక్లాం విషయంలో చైనాపై భారత్ అనుసరించిన విధానాన్నే అనుసరించి వారిని మన దారికి తెచ్చుకోవాలని నవ్వుతూ తెలిపారు. భారత్-చైనా ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొని చివరికి శాంతియుతంగా పరిష్కారమైందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు "ఆరెస్సెస్ మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా" అంటూ చేసిన వ్యాఖ్యలపైనా స్పందిస్తూ... రాహుల్ ఆ ప్రశ్న సూటిగా అడిగి ఉంటే సమాధానం చెప్పేదాన్ని, తప్పుడు భాష ఉపయోగించిన ఆయనకు బదులిచ్చే ప్రసక్తే లేదని సుష్మా స్పష్టం చేశారు.