మాజీ ప్రధాని, ప్రణబ్ ముఖర్జీ పై కురిపించిన ప్రశంసలు....

SMTV Desk 2017-10-14 17:32:28  Former Prime Minister Manmohan Singh, Former President Pranab Mukherjee, The Coalition Years delhi new updates

న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : యూపీఏ హయంలో ప్రధాని పదవి చేపట్టేందుకు తనకంటే ప్రణబ్ ముఖర్జీనే అర్హుడని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. పరిపాలనా పరంగా అపారమైన అనుభవం ఉన్నప్పటికీ ప్రధాని పదవి దక్కకపోవడం పట్ల ప్రణబ్ ఒకింత బాధపడి ఉంటారని ఆయన అన్నారు. అయితే, సోనియానే స్వయంగా తమను ప్రధాని పదవి చేపట్టాలని కోరినందున తమకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘సంకీర్ణ వసంతాలు’(ది కొయిలేషన్‌ ఇయర్స్‌) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... 2004 తను ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా , ఉప అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ప్రధాని పదవికి తమ కంటే ప్రణబ్ ముఖర్జీనే అర్హుడని మన్మోహన్ అన్నప్పుడు సోనియా,రాహుల్ నవ్వడం విశేషం. ప్రణబ్ ను అత్యంత ప్రముఖుడైన పార్లమెంట్ కాంగ్రెస్ వాదిగా మన్మోహన్ అభివర్ణించారు. పార్టీలో ఎలాంటి సమస్య వచ్చిన అందరు ఆయన వైపే చూసేవారు. ఏ సమస్యనైన తనదైన రితీలో మన్మోహన్ కొనియాడారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహా కోరిక మేరకు ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పు కొచ్చిన మంత్రి అదే ప్రణబ్ ముఖర్జీ స్వతహాగా రాజకీయ నాయకుడని దేశంలోనే ఆపారమైన అనుభవమున్న గొప్ప నాయకుడని కితాబు ఇచ్చారు.