దీపావళి సెలవుపై క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..!

SMTV Desk 2017-10-14 14:22:05  TELANGANA GOVERNMENT, DIWALI FESTIVAL, HOLIDAY CHANGE, CM KCR

హైదరాబాద్, అక్టోబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు ఈ నెల 18న పండుగ సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన జీవోలో ఉండగా.. అక్టోబర్ 19న అమావాస్య రావడంతో సెలవును మార్చాలని పలువురు పండితులు కోరడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమావాస్య రోజున పండుగ జరగాలని సూచించడంతో 19వ తేదీన సెలవుగా నిర్ణయించారు. నరక చతుర్దశికి 17న ఐచ్ఛిక సెలవు ఉండగా..18కి మార్చారు. దీంతో 18, 19 తేదీల్లో దీపావళి పండుగ సెలవులు రానున్నాయి.