ఆన్ లైన్ కరెంటు బిల్లు చెల్లింపులో సమస్యలు...

SMTV Desk 2017-10-13 11:57:37  Electricity bill payment centers, Telangana Government Tea-Wallet, Consumer

హైదరాబాద్, అక్టోబర్ 13 : విద్యుత్ బిల్లు చెల్లింపు కేంద్రాలలో చిల్లర సమస్యతో కొద్ది మొత్తం కలిపి తీసుకుని మరుసటి నెలకు ఆ వ్యత్యాసం సర్దుబాటు చేస్తుంటారు. ఈ వివరం బిల్లులో కనిపిస్తుంటుంది. అయితే. ఆన్ లైన్ చెల్లింపులో ఈ వివరం నమోదు కాకపోతే మరుసటి నెల చెల్లింపులో గత వ్యత్యాసం మేరకు మనకు తగ్గింపు ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం టీ-వాలెట్ లో ఈ సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు వలన వినియోగదారుడికి నష్టమని వేరే చెప్పనక్కర్లేదు. వినియోగదారునికి కొద్ది మొత్తం నష్టమైనా డిస్కం దానిపై నిర్లక్ష్యం వహించడం సరికాదు. మీటర్ రీడర్ల మెషిన్లను జిపియస్ తో అనుసంధానిస్తామని, అప్పుడు ఆన్ లైన్ చెల్లింపులకు ఆలస్యమనే సమస్య ఉండబోదని డిస్కం అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ నమోదు ద్వారా ప్రభుత్వానికి త్వరగా డబ్బులు జమ అయ్యే సౌలభ్యం ఉంటుంది. మీటర్ రీడింగు బిల్లు ఇవ్వగానే అది ఆన్ లైన్ లో వెంటనే అప్ డేట్ కావలసివున్నా సిబ్బంది అశ్రద్ధ వలన అలాజరగాకపోవటంతో చెల్లింపులలో కొంత ఇబ్బందికి కారణమవుతుంది. ఈ సమస్యపై డిస్కం అధికారులు దృష్టి పెట్టడం అవసరం. శివారు ప్రాంతస్తులకు ముఖ్యంగా ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను నివారించటం అనివార్యం. కార్యాలయాలు దూరంగా ఉన్న శివారు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు..