రవితేజతో సినిమాకి కథ సిద్ధం..

SMTV Desk 2017-10-11 19:10:05  hero raviteja, vv vinayak, raja the great movie, director anil ravipoodi.

హైదరాబాద్, అక్టోబర్ 11 : రవితేజ -వి.వి వినాయక్ కాంబినేషన్ అంటే గుర్తొచ్చే సినిమా “కృష్ణ”. ఈ చిత్రం ఇద్దరకీ మంచి విజయాన్ని అందించింది. మాస్ మహారాజ్ కి తరువాత వినాయక్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిన వర్కవుట్‌ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ హిట్ జోడి రిపీట్ కానుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే వినాయక్ రవితేజ కోసం ఓ కధ సిద్ధం చేశాడని, 2018 సంవత్సరంలో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన ‘రాజా ది గ్రేట్‌’ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతు౦ది.