ఆకలికి తట్టుకోలేని రష్యా పర్యాటకుడు చివరికి..

SMTV Desk 2017-10-11 17:46:26   Russian Tourist begging, External Affairs Minister, Sushma Swaraj,

న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : కోటి కష్టాలు కూటి కోసమే అంటారు కదా..! అలాంటిది కాలం కలిసి రాకపోతే అదే కూటి కోసం బిక్షమెత్తుకోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్‌ ఒక పర్యాటకుడిగా మన దేశం వచ్చాడు. ఈ క్రమంలో అనేక స్థలాలను ఆయన సందర్శించాడు. దురదృష్టవశాత్తు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అతని వద్ద ఉన్న ఏటీఎం కార్డు పిన్‌ను రష్యా స్తంభింపజేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఆయన ఏటీఎం నుండి డబ్బు తీయడానికి ప్రయత్నించగా కార్డు పిన్‌ను రష్యా నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో ఎటు పాలుపోని ఇవాంజెలిన్‌ ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని ఓ దేవాలయం మెట్లపై బిక్షమెత్తుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి సహాయం చేసి చెన్నై వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించమని సూచించారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ రష్యా అధికారులతో మాట్లాడి ఏటీఎం పిన్‌ పనిచేసేలా చూస్తానని ట్వీట్‌ చేశారు.