హర్యానా అల్లర్లకు నేనే కారణం : హనీప్రీత్

SMTV Desk 2017-10-11 16:42:07  Gurmith Singh Baba, Honey Preeth Singh, Accepted the truth.

హర్యానా, అక్టోబర్ 11 : డేరా స్వచ్చ సౌధా ఛీఫ్ గుర్మీత్ బాబా దత్త పుత్రిక హనీప్రీత్ ను ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుండి సమాచారాన్ని రాబట్టాలని శత విధాలా ప్రయత్నించారు. ఇప్పటివరకు ఆమె అనారోగ్య కారణాలంటూ ఏవో కారణాలు చెప్పి మౌనం వహిస్తూ వస్తున్న హనీప్రీత్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. గుర్మీత్ కు శిక్ష పడిన నేపథ్యంలో హర్యానాలో జరిగిన అల్లర్లన్నింటికీ తానే కారణమంటూ నిజాన్ని ఒప్పుకుంది. తమ అనుచరులతో కలిసి తానే గైడ్‌ మ్యాప్‌లు తయారుచేశానని తెలిపింది. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ... హనీప్రీత్ ఇచ్చిన సమాచారమంతా ల్యాప్‌ టాప్‌లో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇంకా ఆమె నుండి పలు కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.