అగ్రరాజ్య ప్రథమ మహిళ ఎవరు..?

SMTV Desk 2017-10-11 11:44:19  Who is America first woman, Ex-wife Ivana, Melania, Rising Trump book, donald trump.

వాషింగ్టన్, అక్టోబర్ 11 : అమెరికా ప్రథమ మహిళ ఎవరు అనే విషయంపై అగ్రరాజ్యంలో చిచ్చు రాజుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా (68), ప్రస్తుత భార్య మెలానియా (47)ల మధ్య జరుగుతున్న ఈ గొడవతో శ్వేతసౌధంపై ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ తొలి భార్య ఇవానా తానూ రాసిన "రైజింగ్ ట్రంప్" అనే పుస్తక ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్రంప్ తో తనకున్న అనుబంధం, సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకంలో తానూ మొదటి భార్య కావున శ్వేతసౌధంలో ఉండేందుకు తనకు పూర్తి అర్హతలున్నాయని చిరునవ్వుతో వెల్లడించారు. కాని అక్కడ తన రెండో భార్య మేలానియా ఉన్న కారణంగా అక్కడికి వెళ్ళడం లేదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన మేలానియా, ట్రంప్ మొదటి భార్య ఇవానాకు ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న భావన మనసులో ఏర్పడినట్లుంది. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోంద౦టూ విమర్శిస్తూ తన ప్రతినిధి స్టెఫానీ గ్రిషాంతో ప్రకటన చేయించింది. అయితే అగ్రరాజ్య అధినేతగా దేశాన్ని పాలించాల్సిన ట్రంప్ ను ముగ్గురు భార్యలలో ప్రథమ మహిళ ఎవరు అనే పోరు అయోమయంలోకి తోసేస్తోంది.