బెదిరింపులకు బయపడకుండా లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తామంటున్న నిర్మాత

SMTV Desk 2017-10-10 22:18:22  ram gopal varma, ycp rajesh reddy, laxmis ntr, roja

హైదరాబాద్ అక్టోబర్ 10: ఎపుడు వార్తల్లో నిలిచే ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సినిమా ఎపుడు మొదలవుతుందో తనకే తెలీదని చాల సార్లు పబ్లిక్ గానే చెప్పాడు. ఈ సారి మాత్రం ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ చిత్రం తప్పక ప్రారంభం కానుందని అంటున్నాడు. ఈ చిత్ర నిర్మాతగా వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే రామ్ గోపాల్ వర్మ రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, చిత్రం లోని పాత్రలకు సంబందించి ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని చెప్పారు. కానీ వైసీపీ ఎమెల్య రోజాకు ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరి బెదిరింపులకు బయపడకుండా సినిమాను నిర్మిస్తామని, అలాగే చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైన వెనుకాడబోమని అన్నారు.