ముమ్మిడివరంలోని పాఠశాలలో మెడికల్ క్యాంపు

SMTV Desk 2017-10-10 19:16:41  East Godavari, Mummidivaram school medical camp, Dr. Anil Kumar.

తూర్పు గోదావరి, అక్టోబర్ 10 : అంటువ్యాధులు ఇట్టే ఆక్రమించే ఈ వర్షాకాల సీజన్ లో.. ప్రభుత్వాదేశానుసారం ముమ్మిడివరంలోని స్థానిక పాఠశాలలో డా.అనిల్ కుమార్(చిన్నపిల్లల వైద్య నిపుణులు), కొత్త లంక వైద్యాధికారి డా.వినీల్ అధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వ్యాధులతో బాధ పడుతున్న విద్యార్థులకు మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సుజాతతో పాటు సుజనా విక్టోరియా, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.