రెండు రోజుల్లో డిఎస్సి నియామకాలు....?

SMTV Desk 2017-10-10 17:23:24  TSDSC Notifications, Kadiyam Srihari singing

హైదరాబాద్,అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించనుంది. ... రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకానికి ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనికి సంబ౦ధించి నేడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌డీఎస్‌సీ)కి నోటిఫికేషన్ ను వెలువరించేందుకు అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల్లో డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీని వల్ల 12 వేల మంది నిరుద్యోగులకు జీవనోపాధి కలిగే అవకాశం ఉండడంతో నిరుద్యోగులు వేయి కళ్లతో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.