చిరంజీవి గారిని నాకు తెలియకుండానే అనుకరిస్తా : జోష్ రవి

SMTV Desk 2017-10-10 09:27:49  chiranjeevi, josh ravi, i dream interview, megastar

హైదరాబాద్ అక్టోబర్ 10: ‘చిరంజీవి గారంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి రాకముందే నాలో చిరంజీవి గారు ఇంజెక్ట్ అయిపోయారు. తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు.. నాకు నచ్చిన చిరంజీవిగారి పోస్టర్లను కట్ చేసి గోడకు అంటించుకునేవాడిని. ఆ శబ్దాలకు.. మా అమ్మ కంగారు పడి లేచేది. ఇదంతా మా అమ్మకు తెలియకుండానే చేసే వాడిని’ ఇంటర్వ్యూలో చిరంజీవి పై తన అభిమానాన్ని పంచుకున్నాడు జోష్ రవి.. “నేను పెరిగిన వాతావరణంలో అందరూ చిరంజీవిగారి అభిమానులే. అందరి హీరోల సినిమాలు చూస్తా, వారితో నటించాలని నాకు ఉంది. కానీ, చిరంజీవిగారి నటన లో నాకో ఫైర్ కనబడుతుంది. నా బలాలు, బలహీనతలు అన్నీ చిరంజీవిగారే. నాకు ఏదైనా బాధ కలిగితే చిరంజీవి గారి సినిమాలు చూస్తాను. .. ఆయన్ని నేను అమితంగా అభిమానిస్తున్నాను. కష్టపడి పైకి రావడమంటే నాకు తెలిసి చిరంజీవిగారే. ఒక సామాన్యమైన వ్యక్తి ఓ గొప్ప స్థాయికి వెళ్లడానికి ఉదాహరణ చిరంజీవి గారు. చిరంజీవి గారిని నాకు తెలియకుండానే అనుకరిస్తా..ఇకపై తగ్గించుకుంటాను’ అని జోష్ రవి చెప్పుకొచ్చాడు.