గోరఖ్ పూర్ లో మృత్యు ఘోష....

SMTV Desk 2017-10-09 19:04:31  Gorakhpur Burdi Medical College Hospital in Uttar Pradesh, 16 Numbers Childrens death, Brain swelling

గోరఖ్ పూర్, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన మరువక ముందే మరో 16 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రి లో.... మెదడు వాపు వ్యాధికి బాధపడుతూ చేరిన వారిలో, 10 మంది ఇంటెన్సివ్ కేర్ లో...మరో 6 ఐసీయూలో మరణించారు. జనవరి 2017 నుంచి ఈ ఆస్పత్రిలో 310 మంది చనిపోవడం గమనార్హం. కాగా ఆస్పత్రి యాజమాన్యం ప్రస్తుతం మరణించిన చిన్నారులు ఆక్సిజన్ కొరత వల్ల కాదని... వారు ఆస్పత్రిలో చేరే నాటికే విషమ పరిస్థితుల్లో ఉన్నారని, చికిత్సకు స్పందించక పోవడంవల్లనే చిన్నారులు మరణించినట్లు వైద్య బృందం వెల్లడించింది.