ఉత్తరకొరియాపై ట్రంప్ ఆసక్తికర ట్వీట్..

SMTV Desk 2017-10-09 10:51:45   America, North Korea, American President Donald Trump, twits.

అమెరికా, అక్టోబర్ 9 : అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో.. ఉత్తరకొరియాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన పనిని వివరిస్తూ.. ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో "గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది అధ్యక్షులు, వారి కార్యదర్శులు ఉత్తరకొరియాతో సుదీర్ఘ మంతనాలు జరిపి భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. కాని ఆ ట్రిక్కులు పనిచేయకపోగా.... పేపర్ పై రాసుకున్న ఒప్పందాలను.. రాసిన సిరా ఆరిపోకముందే ఆ దేశం ఉల్లంఘించింది. ఒకటి మాత్రం దీనికి వర్తిస్తుంది" అంటూ ఉత్తరకొరియాతో యుద్ధం అనివార్యం అని స్పష్టం చేశారు.