వైరల్ గా మారిన మాండ్యలోని ఘటన

SMTV Desk 2017-10-08 12:22:57  Mandya district of Karnataka state, Raining , Viral, Sugar cane,Crop

మాండ్య, అక్టోబర్ 08 : ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఓ ఘటన వైరల్ గా మారింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో, వరదలు వచ్చి పొలాలు నీటమునిగి కొట్టుకుపోవడం లాంటివి తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా ఓ పంట మొత్తం వరద ఉద్రుక్తికి కొట్టుకుపోవడం ఎప్పుడైనా చూసి ఉంటారా... అంటే అది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో అని చెప్పొచు. మాండ్యలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ప్రాంతంలో చెరకు తోట కోతకు గురై వరద ఉద్రుక్తిలో కొట్టుకుపోయింది. ఓ కాగితం పడవ మాదిరిగా చెరకు పంట పూర్తిగా వరదలో కొట్టుకుపోతుండగా స్థానికులు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.