సూర్యతో రకుల్ రోమాన్స్....

SMTV Desk 2017-10-08 09:04:32  rakul preeth singh, mahesh babu, bruce lee, ram charan, karthi

చెన్నై అక్టోబర్ 8: రామ్‌ చరణ్‌, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన బ్రూస్‌లీ చిత్రం నిరాశపరచినా, మళ్లీ చెర్రీ ధృవ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే విధంగా మహేశ్‌ బాబుతో స్పైడర్‌లో రొమాన్స్‌ చేసింది. ఆ చిత్రాన్ని క్రిటిక్స్‌ ఏరి పారేస్తున్నా, మహేశ్‌ తరువాత చిత్రంలో రకుల్‌ అవకాశాన్ని కొట్టేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడి జోరును అపజయాలు కూడా ఆపలేకపోతున్నాయని చెప్పవచ్చు. అలా తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న రకుల్‌ అదే స్పీడ్ ను కోలీవుడ్‌లోనూ సాగించాలని తెగ ఆశపడుతోంది. తమిళంలో రాణించాలనుకున్న రకుల్ ఆశలను స్పైడర్‌తో నెరవేరుతుందని నమ్మినా, ఆ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడు తాజాగా కార్తీతో చేస్తున్న “ధీరన్‌ అధికారం ఒండ్రు” అనే తమిళ చిత్రాన్ని నమ్ముకుంది. కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించే చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆరంభంలో రకుల్ ను కోలీవుడ్‌ అస్సలు పట్టించుకోలేదు. అనంతరం టాలీవుడ్‌ను ఆశ్రయించి విజయాలు పొందడంతో తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్యతో రకుల్ రొమాన్స్‌ చేయనున్నట్లు సినీ వర్గాలలో హాట్ టాపిక్.