అర్జున్ క‌పూర్ రూపానికి వంక‌లు పెడుతూ ట్వీట్ చేసిన ఓ మ‌హిళ

SMTV Desk 2017-10-07 23:44:04  arjun kapoor, social media, rapist, twitter, bollywood star

ముంబయి అక్టోబర్ 7: సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలను బహిరంగంగా వ్య‌క్తం చేయవచ్చు. నిమిషాల్లో మన అభిప్రాయం దేశం మొత్తం తెలుసుకునే అవకాశం ఉంది ఈ రోజుల్లో. కానీ ఇలాంటి సౌకర్యాన్ని ఇంకొకరిని కించపరిచేలా ఉపయోగించుకుంటేనే సమస్య. సెలబ్రిటీలను హేళన చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ అర్జున్ క‌పూర్ రూపానికి వంక‌లు పెడుతూ ఒక మ‌హిళ ట్వీట్ చేసింది. `అర్జున్ క‌పూర్ చూడ‌టానికి భ‌యంక‌రంగా, ఒక రేపిస్ట్‌లాగ క‌నిపిస్తాడు. బాలీవుడ్ నుంచి అత‌న్ని బ‌య‌టికి పంపిస్తే కొత్త వారికి అవ‌కాశం దొరుకుతుంది` అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి అర్జున్ క‌పూర్ స‌మాధానం ఇచ్చాడు. `ఈ విధమైన కామెంట్ చేయడం ఏమి బాగోలేదు, ఇది అసలు ట్రోలింగ్ కాదు, ఒక మ‌హిళ `రేపిస్ట్‌` అనే ప‌దాన్ని సిగ్గులేకుండా, చాలా సాధార‌ణంగా వాడ‌టం నిజంగా బాధాకరం` అని అర్జున్ ట్వీట్ చేశారు. దీంతో వెంట‌నే ఆ మ‌హిళ త‌న ట్వీట్‌ను డిలీట్ చేసింది.