3డి టెక్నాలజీ తో వస్తున్న రోబో 2.0

SMTV Desk 2017-10-07 21:27:20  robo 2, 2.0, rajini kanth, akshay kumar, shankar, making video

చెన్నై అక్టోబర్ 7: అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం హాలీవుడ్ తరహాలోనే 3డి లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ వీడియో రెండవ పార్ట్ ను కొన్ని గంటల క్రితం చిత్రయూనిట్ విడుదల చేసారు. చిత్ర బృందం ఎంతలా కష్టపడుతున్నారో మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ‘హాలీవుడ్ లో ముందుగా సినిమాని 2డి లో చిత్రీకరించి దానిని 3డి లోకి మారుస్తారు, కానీ 2.0 చిత్రం ముందుగానే 3డి టెక్నాలజీ కెమెరాలను వాడి 3డి లోనే తెరకెక్కించామని దర్శకుడు శంకర్ మేకింగ్ వీడియో లో చెప్పుకొచ్చారు. షూటింగులో ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ ఎంత సీరియ‌స్‌గా పాల్గొంటున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ‘ఈ చిత్రం తో నిర్మాతలు 3డి టెక్నాలజీ లో సినిమాలు తీయడానికి ముందుకు వస్తారని, ఇంకా 3డి థియేటర్స్ కూడా పెరుగుతాయని’ శంకర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 25న విడుదల కానుంది.