ధోని ఆట విడుపు.. సామ్ తో ఆటలు..

SMTV Desk 2017-10-07 17:08:01  Mahendra Singh Dhoni, instagram, pet dog

ముంబై, అక్టోబర్ 7 : మహేందర్ సింగ్ ధోనికి బైక్ లు, పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే చాలు.. బైక్ రైడింగ్ లేదా తన పెంపుడు టామీలతోనే సమయాన్ని గడుపుతుంటారు. ధోనికి పెంపుడు కుక్క "సామ్" వుంది. అదంటే ఆయనకు చాలా ఇష్టం.. ఇది వరకు ఓసారి సామ్‌కు క్యాచ్‌లు పట్టడం నేర్పిస్తున్న వీడియోను పోస్ట్ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి సామ్ తో ఆడుతూ కనిపించారు. ధోని, భార్య సాక్షి.. సామ్‌తో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ధోనీ ఎటు కదిలితే అటు సామ్‌ కూడా కదులుతూ అతన్నే అనుసరిస్తోంది. చివర్లో ధోనీ.. సామ్‌ను దగ్గరకు తీసుకుని ప్రేమగా పట్టుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.