మెహరీన్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంటుంది : రవితేజ

SMTV Desk 2017-10-07 08:32:46  ravi teja, mehreen, anil ravipudi, raja the great, dil raju

హైదరాబాద్ అక్టోబర్ 7: రవితేజ హీరోగా, మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘రాజ ది గ్రేట్’, ఈ చిత్ర ట్రైలర్ విడుదల సందర్బంగా జరిగిన కార్యక్రమం లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. రవితేజ మాట్లాడుతూ... ‘‘మాతో పాటు శిరీష్‌ ఈ సినిమాకి దగ్గరుండి వర్క్‌ చేశారు. అంతకుముందు ఆయనతో నాకంత ఇంట్రాక్షన్‌ లేదు. రాధిక, రాజేంద్రప్రసాద్, పోసాని గార్లతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సూపర్‌. వాళ్లతో పాటు శ్రీనివాసరెడ్డి బాగా నటించారు. మెహరీన్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ అందరూ నెక్ట్స్‌ లెవల్‌కి వెళతారని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. దిల్‌ రాజు మాట్లాడుతూ... ‘‘అనిల్‌ కథ చెప్పగానే, రవితేజ నాకు ఫోన్‌ చేసి... ‘దర్శకుడు నా ముందు చేసినట్టు నేను సినిమాలో చేస్తే చాలు’ అన్నారు. అన్నట్టుగా నే అద్భుతంగా నటించారు. రవితేజ నటనే సినిమా సక్సెస్‌కి ముఖ్య కారణమవుతుంది. వేంకటేశ్వరస్వామి దయ వల్ల హిట్స్‌లో ఉన్న మా సంస్థకి మరో హిట్‌ అందించేలా ఉన్నారు అనిల్‌. దీపావళికి తమిళంలో, హిందీలో పెద్ద సినిమాలు విడుదలవుతాయి. తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తారు. దాన్ని బ్రేక్‌ చేయాలి” అని అన్నారు.