వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ కమల్ కూతురు

SMTV Desk 2017-10-06 23:18:36  kamal hasan, akshara hasan, shamithab, vivekam, web series

చెన్నై అక్టోబర్ 6: కమల్ హసన్ రెండో కూతురు అక్ష‌ర హాస‌న్ బాలీవుడ్ లో ‘శమితాబ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇటీవ‌ల `వివేకం` సినిమాలో హ్యాక‌ర్ పాత్ర‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య ట్రెండ్‌గా మారిన వెబ్ సిరీస్‌ల గురించి ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ వెబ్ సిరీస్‌లు మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, రాబోయే కాలం వెబ్ సిరీస్‌ల‌దేన‌ని అంది. అలాగే ఇత‌ర వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించి కూడా స్టోరీలు వింటున్న‌ట్లు అక్ష‌ర తెలిపింది. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న `సోష‌ల్‌` వెబ్‌సిరీస్ లో ఓ పాత్ర కోసం `వియూ` మీడియా వారు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే దాని గురించి ఇంకా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, ఇంకా ఆ సిరీస్‌లో న‌టించ‌డంపై ఎలాంటి స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని ఆమె వెల్లడించారు.