అందరిని ఆకట్టుకుంటున్న ‘రాజా ది గ్రేట్’ ట్రైలర్

SMTV Desk 2017-10-06 22:00:16  raja the great, mass maharaja, raviteja, mehreen, dil raju

హైదరాబాద్ అక్టోబర్ 6: ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్ ను రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ చిత్రం లో తన మార్క్ కామెడీని ఈ ట్రైలర్ లో చూడవచ్చు. ట్రైలర్ చూడటానికి ప్రామిసింగ్ గా ఉండటం తో, రవితేజ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరగా ట్రైలర్ లో వచ్చిన ‘ఇట్స్..లాఫింగ్ టైం..’ అనే డైలాగ్ అందరిని బాగా ఆకట్టుకుంది. రవితేజ తల్లి పాత్రను సీనియర్ నటి రాధిక పోషించారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని పాటలకు సంబంధించిన సన్నివేశాలు ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన మెహ్రీన్ ఫిర్జాదా నాయికగా నటించింది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.