ఈ చిత్రం ఓ అందమైన అనుభూతి లాంటిది : ప్రభాస్

SMTV Desk 2017-10-06 21:16:36  baahubali, prabhas, shraddha kapoor, sujith, prabhas interview

హైదరాబాద్ అక్టోబర్ 6: బాహుబలి చిత్రంలో తాను నటించడం నిజంగా ఓ అద్భుతమని, ‘బాహుబలి’లో కథానాయకుడిని నేనేనా!’ అని ఒకో సారి ఆశ్చర్యపోతుంటానని చెప్పారు ప్రభాస్. ‘బాహుబలి’ ఇమేజ్ నుంచి బయటకి రావాలని లేదంటున్నారు డార్లింగ్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ బాహుబలి గురించి ఈ విధంగా స్పందించారు. ‘బాహుబలి’ లాంటి చిత్రంలో నటించే అవకాశం ఒక్కసారే వస్తుందని, అలాంటి అవకాశం తనకు దక్కిందని అన్నారు. టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ చిత్రమేనని చెప్పారు. ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరిస్తారని ఎన్నడూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఓ అందమైన అనుభూతి లాంటిదని తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా ‘సాహో’ చిత్రం లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.