బుల్లితెరపై సందడి చేయనున్న పి.వి. సింధు..

SMTV Desk 2017-10-06 18:39:45  Badminton player, P.V. Sindhu, Amitabh Bachchan, Kaun Banega Corod Pati show.

హైదరాబాద్, అక్టోబర్ 6 : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు త్వరలో ఓ రియాలిటీ షోలో కనిపించనుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "కౌన్ బనేగా కరోడ్ పతి" అనే కార్యక్రమం ద్వారా సింధు బుల్లితెర మీద సందడి చేయనుంది. ఇప్పటికే ఆమె మీద కొన్ని ఎపిసోడ్ లను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా గెలిచిన మొత్తాన్ని హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నారు. ఈ బసవతారకం ఆసుపత్రికి ప్రముఖ నటుడు, ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం సింధు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్ళింది. దీనిని బట్టి సింధు ఒక క్రీడాకారిణియే కాదు సమాజానికి సేవ చేయాలన్న ఆమె సేవా దృక్పథం కూడా స్పష్టమవుతోంది.