చైతు-సమంతలకు సర్ ప్రైజ్...

SMTV Desk 2017-10-06 17:58:43  Naga chaitanya samantha wedding, akkineni nagarjuna, Daggubati family

హైదరాబాద్, అక్టోబర్ 6: నేడు నాగచైతన్య-సమంతల వివాహం అంగరంగ వైభవంగా గోవాలో జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకలో భాగంగా అక్కినేని నాగార్జున, వెంకటేష్ లు వరుడు నాగచైతన్యను పెళ్ళికొడుకు చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా అక్కినేని, దగ్గుబాటి కుటుంబం మొత్తం సమంతకు స్వాగతం పలుకుతూ ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులంతా కనిపించను౦డడం విశేషం. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ వీడియో మేకింగ్ వివాహం జరుగుతున్నపుడు ప్రదర్శించేందుకు చైతు, సమంతలకు తెలియకుండా ప్లాన్ చేశారట. ఈ వీడియో సమంతకు ఒక తీపి జ్ఞాపకంగా నిలుస్తుందని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాలలో చైతు జంటకు అభిమానులు శుభాకాంక్షల జల్లు కురిపిస్తున్నారు.