ఆఫ్రికన్‌ సైబర్‌ అక్రమార్కులపై దర్యాప్తు...

SMTV Desk 2017-10-06 13:17:17  African countries such as Nigeria Sudan, Congo, Tanzania, Pass Port , police

హైదరాబాద్, అక్టోబర్ 06 : పర్యాటక, వ్యాపార, ఉన్నత విద్య పేరిట వీసాలు తీసుకుని ఆఫ్రికా దేశాలైన నైజీరియా సూడాన్, కాంగో, టాంజానియా వాసులు నగరానికి విరివిగా వస్తున్నారు. వాళ్లు చేసేది మాత్రం పక్క దగా, వంచనే వారి పెట్టుబడి, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల విక్రయం, మత్తు పదార్ధాల సరఫరా, వ్యభిచారం ఇలా ఏదోఒక అక్రమానికి తెర లేపుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. లాటరీలు, భీమా, కొత్త ఏటీయం కార్డులతో తరచుగా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను నమ్మించి లక్షలు కాజేస్తున్నారు. అక్రమార్కులైన ఈ ఆఫ్రికన్ల పని పట్టడానికి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు ఉమ్మడిగా చర్యలు తీసుకుంటున్నారు. నిర్బంధ తనిఖీలో వారి అవినీతి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. నేరాలనుంచి తప్పించుకునేందుకు పాస్ పోర్టు సైతం చించివేస్తున్నారు. తప్పుడు పేరు చెప్పి కేసు నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పాస్ పోర్టు పోయిందని రాయబార కార్యాలయానికి దరఖాస్తూ చేసుకుని మరో పాస్ పోర్టు పొంది స్వదేశాలకు వెళ్లి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. విదేశీయులు భారత్ కు వచ్చే ముందు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆ సమయంలో వారి వెలీ ముద్రలను సేకరించి భద్ర పరుస్తారు. పాస్ పోర్టు పోయిందని చెప్పే నైజీరియన్ల వేలిముద్రలు వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో పోలీసులు సరిపోల్చుకుంటున్నారు. ఫలితంగా నిందితుల అసలు పేరుతో పాటు పూర్తి వివరాలు తెలుస్తున్నాయి.