ఆ టైప్‌ కాదు నా భర్త : ప్రియమణి

SMTV Desk 2017-10-06 08:37:17  priyamani, marriage, mustafa raj, yamadonga, priyamani interview

హైదరాబాద్‌ అక్టోబర్ 6: ‘పెళ్లిన కొత్తలో’ చిత్రం తో తెలుగులో పరిచయమైన ‘ప్రియమణి’, ‘యమ దొంగ’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఇటీవల ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఆమె వివాహం జరిగింది. పెళ్లయ్యాక తొలిసారి ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పెళ్లయ్యాక భార్య ఇంట్లో కూర్చోవాలి అని చెప్పే టైప్‌ కాదు నా భర్త. డేటింగ్‌లో ఉన్నప్పటి నుంచి పరస్పరం నిజాయితీగా, వాస్తవికంగా ఉన్నాం. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సమయంలో ముస్తఫాని చూశాను. కానీ అది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ముందు ఇద్దరం స్నేహితుల్లా ఉన్నాం. ఆయన నన్ను చిన్నపిల్లలా చూసుకోవడం, కేర్‌ తీసుకోవడం నచ్చింది. అలా ఇద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. అయితే పెళ్లికి తక్కువ మందిని ఎందుకు ఆహ్వానించాం, దానికి ఓ కారణం ఉంది. పెళ్లికి కొద్దిరోజుల ముందే మా బంధువు ఒకరు చనిపోయారు. అందుకే హడావుడి చేయాలనుకోలేదు. జీవితంలో నాకు భర్త, అతని కుటుంబీకులే ముఖ్యం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తాను. ఇందుకు ఆయన కూడా పూర్తి మద్దతు తెలిపారు. ఆఫీస్‌లో పని లేకపోతే ఆయన నా షూటింగ్‌ సెట్స్‌కు కూడా వస్తుంటారు.’అని చెప్పుకొచ్చారు ప్రియమణి.