భారీ వర్షానికి అతలాకుతలమవుతున్న బెజవాడ...

SMTV Desk 2017-10-05 11:59:15  vijayawada, rains

విజయవాడ, అక్టోబర్ 5: విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు భయా౦దోళనకు గురవుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా నగరంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇంతవరకు తగ్గుముఖం పట్టని వర్షాల కారణ౦గా అధికారులు అప్రమత్తమయ్యారు.