డాక్టరేట్ అందుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు : మంచు విష్ణు

SMTV Desk 2017-10-04 23:00:30  mohan babu, collection kin, doctorate, manchu vishnu, manchu family

హైదరాబాద్ అక్టోబర్ 4: గౌరవ డాక్టరేట్ తో ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఎంజీఆర్ విశ్వవిద్యాలయం సత్కరించింది. ట్విట్టర్ ఖాతా ద్వారా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ‘ఎంజీఆర్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న నా హీరో, నా తండ్రి మోహన్ బాబుకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు. చెన్నైలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు, మోహన్ బాబుకు డాక్టరేట్ ను ప్రదానం చేశారు. మోహన్ బాబు గౌరవ డాక్టరేట్ అందుకోవడం తమకు ఎంతో గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ.