అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త

SMTV Desk 2017-10-04 15:46:50  US, DONALD TRUMP, H-1B VISA, US AMBASSADOR KENNY JUSTER.

వాషింగ్టన్, అక్టోబర్ 4 : అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ట్రంప్ ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. అన్ని విభాగాలలో తిరిగి హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇదివరకు అధిక రద్దీ కారణంగా అమెరికా కొత్త వీసా పిటిషన్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ప్రతి సంవత్సరం అమెరికా 65 వేల హెచ్-1బీ వీసాలకు అనుమతిస్తుంటుంది. అందులో 20 వేల వీసాలను స్టెమ్ సబ్జెక్టులను అభ్యసించే వారికి కేటాయించారు. మిగిలిన వీసాల్లో అకాడమిక్, రీసెర్చ్, జాబ్ వంటి పలు విభాగాలు ఉన్నాయి. ఈ విషయంపై యూఎస్ దౌత్యాధికారి కెన్నీత్ జుస్టర్ స్పందిస్తూ.. భారత్, అమెరికా సత్సంబంధాల విషయంలో ఈ వీసాల ప్రాముఖ్యత ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే కొత్త దరఖాస్తులపై కూడా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎస్సీఐఎస్ తెలిపింది.