ఐసిస్‌ సైనికుడే అన్న విషయంపై స్పష్టత లేదు : ట్రంప్‌

SMTV Desk 2017-10-04 12:37:10  Donald trump, islamic state, Stephen Padak.

వాషింగ్టన్, అక్టోబర్ 4 : గతవారం అమెరికాలోని లాస్‌వెగస్‌లో స్టీఫెన్‌ ప్యాడాక్‌ అనే దుండగుడు సంగీత కచేరీనే లక్ష్యంగా.. తూటాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ దాడి చేసింది మా సైనికుడేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించడం సంచలనాలకు దారి తీసింది. ఈ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను స్థానిక మీడియా ప్రశ్నించగా.. అసలు ఆ దుండగుడికి ఐసిస్‌తో సంబంధం గురించి తనకు ఎలాంటి స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు అభిప్రాయపడగా, అందుకు ఇది సరైన సమయం కాదని.. చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో కాల్పులు జరిపిన లాస్‌వెగస్‌ ప్రాంతాన్ని నేడు ట్రంప్ సందర్శించనున్నారు. కాగా స్టీఫెన్‌ జరిపిన ఈ ఘటనలో 59 మంది చనిపోగా, 500 మందికి పైగా గాయపడ్డారు.