తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2017-10-04 11:33:01  Ministry of Finance, Petrol, Diesel, Rates decrease,

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. వరుసగా పెరిగిపోతున్న చమురు ధరలను తగ్గించేందుకు రంగంలోకి దిగింది. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు బుధవారం నుండి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో కేంద్రప్రభుత్వ ఆదాయానికి ఏటా రూ.26 వేల కోట్లు గండీ పడనుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌కు రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 దాకా విధిస్తోంది.