ర‌ణ్‌వీర్ ఫస్ట్ లుక్ హాలీవుడ్ కాపీ అంటున్న విమర్శకులు

SMTV Desk 2017-10-04 09:20:11  sanjay lela bhansali, ranvir singh, shahid kapoor, deepika padukone

హైదరాబాద్ అక్టోబర్ 4: సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పద్మావతి’. దీపికా పదుకొనె, షాహిద్‌ కపూర్, రణవీర్‌ సింగ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని పాత్రల లుక్ ని ఈ మధ్య సోషల్ మీడియాలో విడుదల చేసారు. మొదటగా దీపిక పదుకొనే, ఆ తరువాత షాహిద్ కపూర్ చివరగా రణవీర్‌ సింగ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ రోల్‌కు సంబంధించిన రెండు లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ వ‌స్త్ర‌ధార‌ణను హేళ‌న చేస్తూ ఇంట‌ర్నెట్‌లో ఎన్నో కామెంట్లు క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు `ప‌ద్మావ‌తి` సినిమాలో అత‌ని అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్‌ను కూడా చాలామంది నెటిజ‌న్లు హేళ‌న చేస్తున్నారు. ర‌ణ్‌వీర్ లుక్ హాలీవుడ్ సినిమా `జ‌స్టిస్ లీగ్`లో ఆక్వామ్యాన్ లా ఉందని, బాలీవుడ్ మ‌ళ్లీ హాలీవుడ్ నుంచి కాపీ కొట్టింద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ సినిమా పై బాలీవుడ్ లో బారి అంచనాలు ఉన్నాయి, మరి అంచనాల స్టాయి ని చేరుకుంటుందా లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్‌ 1న వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజునే ఈ చిత్రం విడుదల కానుంది.