‘బాహుబలి’ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు

SMTV Desk 2017-10-04 08:33:32  satyaraj, baahubali, pradhani, tweet, birthday wishes

హైదరాబాద్ అక్టోబర్ 4: గల్లీలో పిల్లాడి నుండి దేశ ప్రధాని వరకు కట్టప్ప పేరు మారుమ్రోగిపాయిన సంగతి అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ లో కట్టప్ప గా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సత్యరాజ్, ఈ మంగళవారం అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా సత్యరాజ్‌ కుమారుడు శిబిరాజ్‌ తన తండ్రికి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘తన నటనతోనే కాకుండా మంచి వ్యక్తిత్వంతో లక్షలాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న ఈ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు.’ అని ట్వీట్‌ చేశారు. హ్యాపీబర్త్‌డే సత్యరాజ్‌, కట్టప్ప అనే హ్యాష్‌ట్యాగ్‌లను, ఇంకా సత్యరాజ్‌ చిన్నప్పటి ఫొటోను ను కూడా జత చేశాడు.