ఏడాది డేటా ప్యాక్ ఆదేశం

SMTV Desk 2017-06-06 15:32:13  trai, data pack, telco,validity

న్యూఢిల్లీ, జూన్ 6 : టెలికం రెగ్యులేటర్ ట్రాయి తాజాగా ఏడాది కాల పరిమితితో కనీసం ఒక మెుబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్ నైనా అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలను కోరింది. కాగా ట్రాయి గతేడాది ఆగస్ట్ లో మెుబైల్ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని 90 రోజుల నుండి 365 రోజుల దాకా పొడిగించుకోవచ్చని అనుమతినిచ్చింది. ఆవిధంగా గడువు పెంచడం ద్వారా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుందని, వన్ టైమ్ యూజర్లను ఆకర్షించవచ్చని ట్రాయ్ భావించింది. ఆ సూచన పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెలికం కంపెనీలు ఏడాది వ్యాలిడిటీతో సరైన డేటా ప్యాక్స్ ను అందుబాటులోకి తీసుకురాలేదు.