కుషాల్ బాబుగా పవన్ కళ్యాణ్..?

SMTV Desk 2017-10-03 12:56:08  PAWAN KALYAN, TRIVIKRAM SRINIVAS, GOOGLE, NAME CHANGE.

హైదరాబాద్, అక్టోబర్ 3 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును గూగుల్ సెర్చ్ ఇంజిన్ మార్చేసింది. ఇంతకీ ఆ కొత్త పేరేంటి అంటారా..! "కుషాల్ బాబు". తన నటనతో ఆకట్టుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ పేరును ఇలా ఎందుకు మార్చవలసి వచ్చిందనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరా..? లేదంటే ఇంకేమైనా ముఖ్య కారణం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ చిత్రం అనుకుందామా అంటే సినీ వర్గాలకు తెలియకుండా కేవలం గూగుల్ కు మాత్రమే ఎలా తెలుస్తుందనేది కాస్త ఆలోచించాల్సిన విషయం. అయితే పవన్ అభిమానులు ఈ పేరు మార్పును చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.