రాళ్ల వాగును నీళ్ల వాగులా?

SMTV Desk 2017-06-06 15:11:02  manchiryala check dam , 11 kms water river

హైదరాబాద్, జూన్ 6: మంచిర్యాల పట్టణాన్ని అనుకొని 11 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న రాళ్ల వాగును నీళ్ల వాగుల మారుస్తామని, అక్కడక్కడ చెక్ డ్యాంలు నిర్మించి సుందరంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ స్వష్టం చేశారు. ఆయన సోమవారం రాళ్ల వాగు ప్రక్షాళన పనుల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ లా ఇక్కడ కూడా రాళ్ల వాగు చుట్టూ మొక్కలు పెంచి అందంగా చేస్తామన్నారు. దీంతో పాటు మందమర్రి మండలం గాంధారి వనంలో రూ.6 లక్షలతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నం జింక విగ్రహాని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.