నేడు సరస్వతిగా దుర్గమ్మ... పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

SMTV Desk 2017-09-27 12:08:28  vijajyawada kakanadurgamma, CM Chandrababu, 7th day Dessara celebrations

విజయవాడ, సెప్టెంబర్ 27: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చి, ఏడో రోజైన నేడు ఆశ్వయుజ శుద్ధ సప్తమిన శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) అవతారంలో తెలుపు వర్ణం చీరతో భక్తులకు ఆభయమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ ఆలయానికి పట్టువస్త్రాలు తీసుకొచ్చిన దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు మాణిక్యం రావు,దేవినేని ఉమా తదితరులు ఉన్నారు.