‘అవతార్‌ 2’ షూటింగ్ ప్రారంభమైంది

SMTV Desk 2017-09-26 23:19:03  jams camaron, avatar, highest budjet, sequels, avatar 2

హైదరాబాద్ సెప్టెంబర్ 26: జేమ్స్ కెమెరాన్ ‘అవతార్’ చిత్రాన్ని ప్రపంచమంతా చూసింది. ఇప్పటికి ఈ సినిమా లోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి అందరు మాట్లాడుకుంటారు. మోషన్ కాప్చర్ టెక్నాలజీని, 3డి టెక్నాలజీ కెమెరాలను మొదటి సారిగా కనుగొని ఈ సినిమాలోనే ఉపయోగించారు. అవతార్ సినిమాకు రూ.1500 కోట్ల బడ్జెట్ పెడితే, ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టి అత్యధిక వసూల్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్ ని తీస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నాలుగు సీక్వెల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్‌ పనులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.. అయితే ఈ సీక్వెల్స్‌ బడ్జెట్‌ ఒక బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చు (దాదాపు రూ.6539 కోట్లు)తో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 18 2020లో ‘అవతార్‌ 2’ విడుదల కాబోతోంది. డిసెంబరు 2021లో ‘అవతార్‌ 3’, డిసెంబరు 2024లో ‘అవతార్‌ 4’, డిసెంబరు 2025లో ‘అవతార్‌ 5’లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.