‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరింది

SMTV Desk 2017-09-26 22:49:18  laxmis ntr, ramgopal varma, sr ntr, first look poster, publicity

హైదరాబాద్ సెప్టెంబర్ 26: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వర్మ సోషల్ మీడియా లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బ్లూ కలర్ చీర ధరించిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్తుండగా, ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి అస్పష్టంగా కనపడుతుంటారు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు పబ్లిసిటీని కోరుకునే వ్యక్తీ, అందరి అటెన్షణ్ తనపై ఉండేలా చూసుకుంటారు. తను చేసే ప్రతి సినిమాకి సులువుగా పబ్లిసిటీ ని కల్పించగలవాడు వర్మ. ఇపుడు ఈ చిత్రం టైటిల్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ‘లక్ష్మీస్’ను ఎరుపు రంగులో, ‘ఎన్టీఆర్’ ను పసుపు రంగులో డిజైన్ చేయడంతో సినిమా గురించి అందరు మాట్లాడుకునేలా చేసారు. ఈ సినిమాపై నెటిజన్లు తమ దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమాని ఎపుడు రిలీజ్ చేస్తాడో వర్మ కే తెలియాలి.