కల్తీ నూనె ముఠా గుట్టు రట్టు...

SMTV Desk 2017-09-26 15:50:53  visakapatnam, Kalti Oil Group, HB colony in visakhapatanam

విశాఖపట్టణం, సెప్టెంబర్ 26: విశాఖపట్టణంలో కల్తీ నూనె దందా జోరుగా కొనసాగుతుంది. తాజాగా కల్తీ నూనె తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపధ్యంలో హెచ్ బీ కాలనీలో 4500 లీటర్ల నకిలీ నూనె ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నూనె నిర్వాహకులలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే... వారు ఇదివరకే వాడిన నూనెను టిన్నులలో నింపి హైదరాబాద్ కు తరలిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికారులు స్పందిస్తూ... ప్రజలు నూనె కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.