భూ ఆక్రమణదారులకు అండగా ప్రభుత్వం: రేవంత్

SMTV Desk 2017-06-06 14:08:27  Registrations,Miyapoor,CM office,TDP members

హైదరాబాద్, జూన్ 6 : వేల కోట్ల మియాపూర్ భూ ఆక్రమణదారులకు ప్రభుత్వం సహకరిస్తుందని టీడీపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. భూ కుంభకోణం జరిగి వారం రోజులు అయినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సోమవారం టీటీడీపి నేతలు హైదరాబాద్ లోని మియాపూర్ భూముల్లో పర్యటించారు. కొంతమంది రిజిస్ట్రార్లను విధులోంచి తొలగించి, మరికొంతమందిని బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థ యజమాని బంధువు ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నట్టు తెలిసిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వారందరినీ వెలికితీయాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.