బకాయిలపై అన్ని పార్టీలకు ఈసీ లేఖ

SMTV Desk 2017-09-26 12:52:41  National, regional parties, Election Commission, letter

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ప్రభుత్వ స్థలాలు లేదా భవనాలు వాడుకుంటే, విద్యుత్, నీటి, టెలిఫోన్ రుసుములు చెల్లించినట్లు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు లేఖలు రాసింది. ఒక వేళ ప్రమాణ పత్రాలు దాఖలు చేయని పార్టీలపై ఏ విధమైన చర్యలు ఉంటాయన్న విషయంపై మాత్రం ఇంకా ఈసీ ఏ స్పష్టత ఇవ్వలేదు. విద్యుత్, నీటి, టెలిఫోన్ రుసుములతో పాటు ప్రభుత్వ భవనాల స్థలాలు వినియోగించుకుంటే వాటి బకాయిలు చెల్లించని పార్టీల అభ్యర్ధులను ఎన్నికల బరిలో దించకుండా నిషేధించాలంటూ 2015 లో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీ పార్టీలకు లేఖలు రాసింది.